తిరువనంత పురం:నూతన పౌరసత్వ చట్టాన్ని కేరళ శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా తిరస్కరించింది. ముఖ్యమంత్రి పిన రాయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేరళలో ఎలాంటి నిర్బంధ కేంద్రాలు ఉండవని తేల్చి చెప్పారు. మతాతీత లౌకిక రాష్ట్రామనే గుర్తింపు కేరళకు ఉందన్నారు. గ్రీకులు, రోమన్లు, అరబ్బులు ఇలా ప్రతి ఒక్కరు ఈ గడ్డపై నడయారన్నారు. క్రైస్త వులు, ముస్లింలే ఇతరుల కంటే ముందుగా ఇక్కడ కాలుమోపారు. అందరినీ కలుపుకుని పోవడమే కేరళ సాంప్రదాయ మంటూ దాన్ని నిలుపుకుంటామన్నారు. తీర్మానాన్ని సభ్యుడు జేమ్స్ మాథ్యూ సమర్థించారు. ఎన్ఆర్సి, సిఎఎ ఒకే నాణా నికి రెండు వైపుని కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపించారు.