తాజా వార్తలను ఘటనా స్థలం నుంచి ఎప్పటికప్పుడు వీక్షకులకు అందించడానికి ఎలాక్ట్రానిక్ మీడియాలో పని చేసే జర్నలిస్టులు చేసే ఫీట్లు ఆ క్రమంలో వారికి ఎదురుయ్యే సవాళ్లు అన్ని ఇన్నీ కావు.కొన్ని ఘటనల్లో మనుషులే రిపోర్టర్లకు అవాంతాలు సృష్టిస్తే మరికొన్ని ఘటనల్లో ప్రకృతి,జంతువులు సైతం రిపోర్టర్లను అవాంతరాలు సృష్టిస్తాయి.అటువంటి ఘటనే గ్రీస్ దేశ రాజధానిలో ఆదేశ ప్రముఖ ఛానెల్ రిపోర్టర్‌కు ఎదుఐంది.ఇటీవల గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో భారీ తుపాను సంభవించడంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఈ విషయాన్ని రిపోర్టింగ్ చేయాడానికి ఓ న్యూస్ చానల్ రిపోర్టర్ లాజోస్ మాంటికో వరదలు సంభవించిన ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుంచి స్టూడియోకు లైవ్ ఇచ్చేందుకు సిద్ధపడుతుండగా ఓ వరాహం అతడి వెంటపడింది.మాంటికో ఎటు వెళితే అది కూడా అటే వెళుతూ అతడ్ని నానా తిప్పలు పెట్టింది. బాగా బలిసిన ఆ వరాహం ముట్టెతో నెడుతుండడంతో రిపోర్టర్ దాని నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడ్డాడు. ఓవైపు లైవ్‌లో యాంకర్, ఇతర ప్రెజెంటర్లు సిద్ధంగా ఉన్నా ఆ పంది నుంచి తప్పించుకోలేక సతమతమయ్యాడు. ఇది చూసి స్టూడియోలో ఉన్నవాళ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Greek journo pestered by a pig while reporting on the recent floods in #Kinetta #Greece #tv #bloopers #ant1tv #Ant1news pic.twitter.com/vsLBdlWCMB
— Kostas Kallergis (@KallergisK) November 26, 2019