హైదరాబాదు :చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరల్ని గత ఐదు రోజుల్లో నాలుగోసారి శనివారం మళ్లీ పెంచేశాయి. ఇప్పటి వరకు లీటరుకు 80 పైసల చొప్పున పెంచిన సంస్థలు శుక్రవారం మరికాస్త పెంచాయి. పెట్రోలుపై 89 పైసలు, డీజిల్పై 86 పైసలు అధికమయ్యాయయి. హైదరాబాద్లో ఇప్పుడు లీటరు పెట్రోలు ధర రూ. 111.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.10కి పెరిగింది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ. 113.60 కాగా, డీజిల్ ధర రూ.99.50గా ఉంది. ఈ ఐదు రోజుల్లో పెట్రో ధరలు లీటరుకు రూ.3.20 పెరిగాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం ఆరు గంటల నుంచే అమల్లోకి వచ్చాయి