న్యూ ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మే మాసంలో మంగళవారం 13 వసారి పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 25 పైసలు చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 93.44 కు, లీటర్ డీజిల్ ధర రూ.84.32 కు చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌తో సహా ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపుడు 18 రోజులు ఇంధన ధరలు పెరగలేదు. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం అన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటిస్తాయి. వ్యాట్, సరుకు రవాణా ఛార్జీలు తదితర స్థానిక పన్నుల కారణంగా, ఇంధన ధరలు ప్రతి రాష్ట్రానికి మారుతుంటాయి. పెట్రోల్‌పై వ్యాట్ రాజస్థాన్‌లో అత్యధికం. దాని తరువాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి.