న్యూ ఢిల్లీ: చమురు ధరలు వరుసగా సోమవారం- ఏడో రోజు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు 23 నుంచి 26 పైసల మధ్య, డీజిల్ ధర 28 నుంచి 30 పైసల మధ్య పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.88.73, డీజిల్ ధర లీటరుకు రూ.79.35కి చేరింది. గత ఏడు రోజుల్లో పెట్రోల్ ధర రూ.2.06, డీజిల్ రూ.2.56 పెరగడం గమనార్హం. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ రూ. 92.53, డీజిల్ రూ.86.55గా ఉంది. అమరావతిలో లీటరు పెట్రోల్ రూ. 95.13, డీజిల్ రూ. 88.63కి చేరాయి. ఇక, ముంబైలో లీటరు పెట్రోలు రూ .95.46, డీజిల్ రూ.86.34గా ఉంది. కోల్కతాలో లీటరు పెట్రోల్ రూ. 90.25, డీజిల్ రూ.82.94కి చేరగా, చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.91.19, డీజిల్ రూ.84.44కి పెరిగింది.