అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికం కావటంతో ఆవటంతో వరుసగా ఆరో రోజు – మంగళ వారమూ పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిల్ ధరలూ అధికమయ్యాయి. ఢిల్లీ, ముంబయి, కోల్కతాల్లో లీటరు పెట్రోల్ ధర 15 పైసలు, చెన్నైలో 16 పైసలు పెరిగింది. హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 78.96, డీజిల్ ధర 71.85. లీటరు పెట్రోలు ధర విజయ వాడలో రూ.78.17, డీజిల్ ధర 70.81. చెన్నైలో పెట్రోలు ధర రూ. 77.13, డీజిల్ ధర రూ.69.59లు.