గుంటూరు : ‘సుపరిపాలన అంటే మనుషులను చంపడమా ?’ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. తాజాగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ …. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. ఎపిలో పోలీసు వ్యవస్థ ఎక్కడుంది ? అని ప్రశ్నించారు. బాబురావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా అని అడిగారు. టిడిపి నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగ మల్లేశ్వర రావు చేసిన నేరమా ? అని ప్రశ్నించారు. సుపరిపాలన అంటే మనుషులను హత్య చేయడమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రతీరోజూ ఆడ పిల్లలు బలి అవుతున్నారనీ, ప్రతీరోజూ వైసిపి నేతలపై హత్యలు, హత్యాయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ ఎక్కడుంది ? అని అడిగారు. దాడులు చేయాలని, భయపెట్టాలని, ఊరిలో నుంచి తరిమేయాలని చెబుతున్నారు… రాష్ట్ర ప్రజలకు మీరు ఏమైనా చేశారా ? అని ప్రశ్నించారు. నాగ మల్లేశ్వర రావు కుటుంబానికి మంచి పేరుందని, చంద్రబాబు సహా టీడీపీ నేతలు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నాగ మల్లేశ్వర రావు కుటుంబానికి నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉందని చెప్పారు. టిడిపి నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగ మల్లేశ్వర రావు చేసిన నేరమా ? అని అడిగారు. బాబురావు మీద దాడి చేసి కొడుతుంటే అడ్డుపడింది ఆయనే కదా ? బాబు రావును కాపాడింది కూడా ఆయనే కదా ? బాబురావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా ? అని అన్నారు. వైసిపికి పట్టున్న గ్రామాల్లో రాజకీయ అలజడి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వెళ్లనూరులో ఆరుగురిని ఎందుకు చంపారు ? అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కాదా ? అని అడిగారు. సుపరిపాలన అంటే మనుషులను చంపడమా ? అని మరోసారి ప్రశ్న సంధించారు. ఎపిలో అమ్మాయిల మిస్సింగ్‌లను పోలీసులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ చెబితేనే పోలీసులు పనిచేస్తారా ? అని అడిగారు. చంద్రబాబుకు ఆపద వస్తే ఒక చెల్లి, ఒక తమ్ముడు కలుగులోంచి వస్తారు అని ఎద్దేవా చేశారు. వైద్య విద్యార్థులను బాధ పెట్టి కూటమి పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎస్, ఐఏఎస్‌లపై కూటమి ప్రభుత్వం పగ సాధిస్తుందని పేర్ని నాని మండిపడ్డారు.