న్యూఢిల్లీ : ఇక్కడి జావహర్లాల్ విశ్వ విద్యాలయ ఆవరణలోని విద్యార్థి వసతి గృహాలపై ఆదివారం రాత్రి ఓ పథకం ప్రకారమే దాడి జరి గింద నేందుకు అనేక కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెరియార్, సబర్మతి వసతి గృహాలపై దుండగులు దాడు లు జరిపారు. సబర్మతి హాస్టల్లోనే ఎక్కువ గదులు ధ్వంసమయ్యాయి. అఅక్కడ ఎక్కువగా వామపక్ష, ముస్లిం విద్యార్థు లుం టారు. విద్యార్థి సంఘం నాయకురాలు ఐశే ఘోష్పై దాడి కూడా అక్కడే జరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ రీసర్చ్ స్కాలర్ తెలిపారు. కళ్లు కనిపించని ఓ సంస్కత స్కాలర్ గదిపై కూడా దాడి చేశారు. ఆ గది తలుపుపై బీఆర్ అంబేడ్కర్ పోస్టర్ ఉండడమే అందుకు కారణమని తెలుస్తోంది. బాబర్ కీ ఔలాద్’ అంటూ తనను చితక బాదినట్లు కశ్మీర్ విద్యార్థి ఒకరు ఆరోపించారు. ఏబీవీపీ పోస్టర్లు, గుర్తులున్న ఏ హాస్టల్ గదిపై దుండగులు దాడి చేయక పోవడం గమనార్హం. దుండగులు దాడి చేసిన ప్పుడు పలువురు విద్యార్థులు తమ సెల్ఫోన్ల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు రాలేదని విమర్శించారు. ఆ రో జు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటలవరకు విధులు నిర్వహించాల్సిన ఒక్క భద్రతా సిబ్బంది కూడా హా జ రు కాలేదు.