పెగాసస్​ గుట్టు తేల్చేందుకు విచారణ కమిషన్

కోల్ కతా:పెగాసస్ నిఘా వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు “పెగాసస్ ద్వారా న్యాయవ్యవస్థ, పౌర సమాజంతో పాటు ప్రతి ఒక్కరినీ నిఘా నీడలో ఉంచారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తుందని భావించాం. కానీ వారు అలా చేయలేదు. పెగాసస్పై దర్యాప్తు ప్రారంభించిన తొలి రాష్ట్రం బంగాల్. రాష్ట్రానికి చెందిన కొందరి పేర్లు పెగాసస్ లక్షిత జాబితాలో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా హ్యాకింగ్కు పాల్పడటంపై కమిషన్ విచారణ చేపడుతుంద’ని వివరించారు. ఈ కమిషన్లో కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్ సభ్యులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos