నెమళ్లను చూసైనా నేర్చుకుంటారా?

నెమళ్లను చూసైనా నేర్చుకుంటారా?

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు,వైద్యులు చెబుతున్నా మనుషులు మాత్రం ఆ సూచనలను పెడచెవిన పెడుతున్నారు.ఫలితంగా ప్రతిరోజూ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఇటువంటి నిర్లక్ష్యపు ప్రజలకు కనువిప్పు కలిగించేలా నెమళ్లు సామాజిక దూరం పాటిస్తూ కూర్చున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.రాజస్థాన్లోని నాగౌర్లో ఒక ప్రభుత్వ పాఠశాలలోసామాజిక దూరంకొనసాగిస్తూ ఏడు నెమళ్ళు ఒక వరుసలో కూర్చుని కనిపించాయి. సంఘటనను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో పంచుకున్నారు. ‘జాతీయ పక్షుల నుంచి అయినా లాక్డౌన్లో సామాజిక దూరం పాటించడం నేర్చుకోండిస‌. అనే క్యాప్షన్తో పోస్ట్ చేశాడు. పోస్ట్ని 1,000 కంటే ఎక్కువే రీట్వీట్లు చ్చాయి. 8,000 మంది లైక్చేశారు. పోస్ట్ వైరల్ అయిన వెంటనే నెటిజనులు కామెంట్లతో సామాజిక దూరం  అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos