విడుదలైంది… జార్జ్‌రెడ్డి ట్రైలర్

విడుదలైంది… జార్జ్‌రెడ్డి ట్రైలర్

హైదరాబాద్: చరిత్ర మరచిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన చలన చిత్రం- జార్జ్రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన గురించి తెలుసు. ఆ నేత గురించి ఈ తరం తెలుసుకునేందుకు రూపొందించిన జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ మంగళవారం విడుదలైంది. సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. వంగ వీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి పాత్రలో ఇమిడి పోయారు. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఉస్మానియాలో ఉద్యమాల వైపు ఆకర్షితుడైన జార్జ్ రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పీడీఎస్యు)ను స్థాపించారు.ఇది భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) విద్యార్థి విభాగం అనుబంధ సంస్థ. 25 ఏళ్ల వయసులో, ఉస్మానియా ఆవరణలో 30 మంది మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి జార్జ్ రెడ్డిని హత్య చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos