చిదంబరం కేసు వాయిదా

చిదంబరం కేసు  వాయిదా

న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 26కు వాయిదా వేసింది. ఇదే వ్యవహారానికి సంబంధించి ఈడీ దాఖలు చేసిన కేసులో చిదంబరానికి ముందస్తు బెయిల్ లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ చెర నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం చిదంబరం చేసిన అనేక ప్రయత్నాలు ఫలించ లేదు. ఆయన వ్యాజ్యంపై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయ స్థానం అంగీకరించలేదు. లోతైన దర్యాప్తు కోసం చిదంబ రాన్ని ఈ నెల 26 వరకు సీబీఐ నిర్బంధానికి న్యాయ స్థానం అప్పగించింది.  ఆ నిర్బంధంగా సోమవారం పూర్తి కానున్నా ఆ రోజే ఆయన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.ఈడీ కేసులో ఆగస్టు 26 వరకు ఈడీ అధికారులు అరెస్టు చేయరాదని సూచించింది. విచారణకు సహకరించాలని ఆయన్ను ఆదేశించింది. ఈడీ, సీబీఐ రెండు కేసులపై సోమవారం మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos