న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అరెస్ట్ చేయడం సంతోషించదగ్గ విషయమని ఈ కేసులో అప్రూవర్ గా మారి న ఇంద్రానియా ముఖర్జీ వ్యాఖ్యానించారు. చిదంబరం కుమారుడు కార్తీ బెయిల్ కూడా రద్దు కావాలని ఆశించారు. చిదంబరం, ఆయన కుమా రుడు కార్తీలకు వ్యతిరేకంగా ఇంద్రాణి న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పారు. ‘పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఐపీబీ నుంచి అనుమతులు ఎంతకీ రాలేదు. దీంతో తాము అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలిసాం. తన కుమారుడు కార్తీని కలవాలని ఆయన తమకు సూచించారు. ఢిల్లీలోని ఓ హోటల్ లో కార్తీని మేము కలిశాం. డీల్ కుదిరిన తర్వాత కార్తీ చిదంబరం సంస్థలకు మేము నగదు బదిలీ చేశామ’ ని ఆమె కోర్టుకు తెలిపారు.