న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్ర వారం తోసిపుచ్చింది. ఆయనపై ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన చురుకైన, కీలక పాత్ర పోషించినట్టు జస్టిస్ సురేష్ కుమార్ కెయిత్ అభిప్రాయపడ్డారు. ‘నిస్సందేహంగా బెయిలు కోరడం ఆయన హక్కు. ఇలాంటి కేసుల్లో బెయిలు మంజూరు చేస్తే అది ప్రజాప్రయోజనాలకు విరుద్ధమవుతుంది’ అన్నారు.