న్యూ ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ న్యాయస్థానం అక్టోబర్ మూడు వరకు పొడగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు గత నెలలో అరెస్టు చేసారు. సెప్టెంబర్ 5న విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయ నకుఈ నెల19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గురు వారం ఆ గడువు ముగిసింది. అయినా ఆయన జ్యుడీషియల్ కస్టడీని వచ్చే నెల మూడు వరకూ పొడగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకూ ఆయన తిహార్ చెరసాల్లో గడపక తప్పదు.