న్యూ ఢిల్లీ: ఇండియాలో అంతా బాగుందని హ్యూస్టన్లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీ గొప్పగా చెప్పుకోవటాన్ని కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఎద్దేవా చేసారు. ‘నిరుద్యోగం, ఉన్న ఉద్యోగాలు కోల్పోతుండటం, తక్కువ వేతనాలు, సామూహిక హింసా కాండ, కశ్మీర్ మూసివేత, విపక్ష నేతలను జైళ్లలోకి గెంటడం తప్పించి మిగిలినదంతా ఇండియాలో బాగుంద’ని చిదంబరం ట్వీట్ చేసారు.