న్యూ ఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలపై రైతులు నిరవధికంగా సాగిస్తున్న ఆందోళనను కరోనా సాకుగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్ని స్తోందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం శుక్రవారం విమర్శించారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘రైతుల ఆందోళన కొనసాగేలాచూడటమే కేంద్రం కొత్త స్పిన్ . కరోనా సమయంలో ఇలా చేయడం అన్యాయం. రైతుల ఆందోళనకు 6 నెలలు ముగిసింది. రైతులు స్థిరనిశ్చయంతో ఉంటే, ప్రభుత్వం పట్టుదలకు పోతోంది. ప్రజాసేవే ప్రభుత్వ పరమావధి అయితే ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం తలవొగ్గాలి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలి. తు ప్రతినిధులతో తిరగి సంప్రదింపులు సాగించాల’ని డిమాండ్ చేశారు.