న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ)లో శ్రీలంకపై తీర్మానంపై ఓటింగ్కు భారత దేశం గైర్హాజరయినందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమిళుల మనోభావాలను పట్టించుకోకుండా, వారికి తీవ్ర ద్రోహం చేసిందని మండి పడ్డారు. తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.2008-09లో శ్రీ లంకలో కిరాతకంగా అంతర్యుద్ధం జరిగింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)పై ప్రభుత్వ బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించేందుకు అవకాశం కల్పించే తీర్మానాన్ని యూఎన్హెచ్ఆర్సీలో కొన్ని దేశాలు ప్రతిపాదించాయి. ఈ తీర్మానంపై ఓటింగ్ మంగళవారం జరిగింది. ఈ ఓటింగ్కు భారత దేశం, మరొక 13 దేశాలు గైర్హాజరయ్యాయి. గైర్హాజరవడానికి కారణాన్ని భారత ప్రభుత్వం వివరించింది. తమిళులకు శ్రీలంకలో సమానత్వం, న్యాయం, గౌరవం, శాంతి లభించాలనే అంశానికి మద్దతివ్వడం, శ్రీలంక సమైక్యత, సుస్థిరత, ప్రాదేశిక సమగ్రతలను కాపాడటం కోసం ఓటింగ్కు గైర్హాజరైనట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో చిదంబరం బుధవారం ఇచ్చిన ట్వీట్లో, యూఎన్హెచ్ఆర్సీలో శ్రీలంకపై తీర్మానానికి ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరైందని, ఇది తమిళులకు నమ్మక ద్రోహం చేయడమేనని తెలిపారు. తమిళుల ఏకాభిప్రాయంతో కూడిన సెంటిమెంట్లు, ఆకాంక్షలకు కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు.చిదంబరం ఇచ్చిన మరొక ట్వీట్లో, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిని తమిళనాడు శాసన సభ నభ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఆ కూటమిని ఓడించి, శిక్షించాలని కోరారు. యూఎన్హెచ్ఆర్సీలో శ్రీలంకపై తీర్మానంపై ఓటింగ్కు గైర్హాజరవడం వల్ల తమిళుల ప్రయోజనాలకు తీవ్రమైన హాని జరిగిందని పేర్కొన్నారు.