ఢిల్లీ : పేటీఎం రూ.326.80 కోట్లతో బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను చేజిక్కించుకుంది. 2019-23 సంవత్సరానికి పేటీఎం ఈ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుందని బీసీసీఐ బుధవారం తెలిపింది. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచుల్లో ఒక్కో దానికి రూ.3.80 కోట్లతో హక్కులు దక్కించుకుంది. గతంలో ఒక మ్యాచ్‌కు బిడ్ ధర రూ.2.4 కోట్లు. ఇప్పుడు దాదాపు 58 శాతం వృద్ధి చెందినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ క్రికెట్‌కు పేటీఎం సుదీర్ఘ కాలం పాటు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నందుకు తాము గర్విస్తున్నామని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ తెలిపారు.