జగన్‌ పాలనపై ఆంగ్ల కథనాలను తెలుగులోకి అనువదించిన పవన్‌..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని, సమతూకం లేని పాలన నడుస్తోందని ఢిల్లీ మీడియా కోడై కూస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్ తిరోగమన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ జాతీయ మీడియాలో ప్రచురితమైన సంపాదకీయాల తెలుగు అనువాదాలను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.అమరావతి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం పట్టణాభివృద్ధికి విఘాతం, కారణంతో భారత్ లోని విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం వమ్మయింది. రాష్ట్రాభివృద్ధి దిశగా, జగన్ తన నిర్ణయాన్ని మరోసారి పరీక్షించుకోవాలని, సింగపూర్ కన్సార్టియంతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దుకు చూపిన సాకులు పక్కాగా రాజకీయ ప్రేరేపితాలేనని రాసిన సంపాదకీయాన్ని పవన్ ఉటంకించారు. దేశంలోని యువ ముఖ్యమంత్రుల్లో ఒకరైన జగన్ పాలన భయాందోళన కలిగిస్తోందని, చంద్రబాబు నిర్మించిన, ప్రతిపాదించిన వాటిని కొనసాగించరాదన్న భావనలో జగన్ ఉన్నారని సాగిన మరో సంపాదకీయాన్ని కూడా పవన్ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos