చిత్రమైన హావభావాలు అంతకంటే విచిత్రమైన హెయిర్ స్టయిల్స్ తో టీవీ 9 న్యూస్ రీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న దేవి నాగవల్లిని పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేశారు.బిగ్ బాస్ 4 సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లిన దేవిని ఎలిమినేట్ చెయ్యడం తమ టార్గెట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.గత వారం నటి మాధవీ లత పవన్ కళ్యాణ్ మీద చేసిన వివాదాస్పద కామెంట్లను టీవీ9 పదే పదే టెలికాస్ట్ చేసింది. దానికి జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ తరువాత ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #shamelesstv9 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు.ఒకరకంగా వారంతా టీవీ9 మీద చాలా కోపంగా ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం శ్రీరెడ్డి విషయంలో కూడా టీవీ9 ఇలాగే ప్రవర్తించి పవన్ కు కోపం తప్పించింది. ఇప్పుడు దానిని దేవి నాగవల్లి మీద చూపిస్తామని వారంతా బాహాటంగానే అంటున్నారు.మరి దేవి వారి దాడిని తట్టుకోగలదో లేదో చూడాలి..