ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపార్టీలోనూ నైతిక
విలువలు,సిద్ధాంతాలు లేవంటూ అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ విశ్లేషకుల్లోనూ ప్రతీరోజూ
చర్చలు జరుగుతూనే ఉండడం సహజం.ముఖ్యంగా రాజకీయ పార్టీలో అవినీతికి అడ్డు ఉండదని
అధికారం,ధనార్జనే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పని చేస్తున్నాయని ప్రజల్లో బలంగా
నాటుకుపోయిన అభిప్రాయం.ఇటువంటి పరిస్థితుల్లో తమ పార్టీ మిగతా పార్టీల కంటే
భిన్నమని నిరూపించుకోవడంపై దృష్టి సారించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అందులో
మొదటి అడుగు వేసారు.పార్టీకి స్వయంగా తానే అధినేతే అయినా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ
చేయాలని ఆసక్తి ఉందని అందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ విజయవాడలోని పార్టీ కేంద్ర
కార్యాలయంలో ఎన్నికల కమిటీకి దరఖాస్తు అందించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అనుభవాల దృష్ట్యా.. టికెట్ల పంపిణీ ఇష్యూలో ఎలాంటి రచ్చ జరగకూడదన్న ఆలోచనలో ఉన్న పవన్.. అందుకు తగ్గ మార్గదర్శకాల్ని తయారు చేయించారు. వీటికి పార్టీ అధినేతగా తాను సైతం మినహాయింపు కాదన్న విషయాన్ని తెలియజేసేందుకు ఆయన కూడా స్వయంగా అప్లికేషన్ పెట్టుకున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అనుసరించాల్సిన విధానం.. వడబోత చేసే పద్దతిపై భారీ చర్చ జరిగింది. ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఎన్నికల్లో పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. తన అప్లికేషన్ ను పార్టీ ఎన్నికల కమిటీకి అందజేశారు. ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆసక్తి చూపే అభ్యర్థులు.. వారి బయోడేటాలను మాదాసు గంగాధరం ఆధ్వర్యంలోని వడపోత కమిటీకి పవన్ తన దరఖాస్తును అందించారు. అభ్యర్థులు పక్క దారి పట్టకుండా ఉండేందుకు వీలుగా పార్టీ ఏర్పాటు చేసిన మాదాసు కమిటికి తప్పించి వేరెవరికి అప్లికేషన్లు ఇవ్వకూడదని డిసైడ్ చేశారు. ఫార్సుగా అనిపించే పవన్ కల్యాణ్ అప్లికేషన్ ఎపిసోడ్ కాస్తంత కామెడీగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. పవన్ ఫాలో అయిన రూల్స్ ను.. జనసేన నేతలు.. టికెట్లు ఆశించే వారెంతవరకూ ఫాలో అవుతారో చూడాలి.