దేశానికి మూడో ఫ్రంట్ అవసరం

దేశానికి మూడో ఫ్రంట్ అవసరం

ముంబై : కాంగ్రెస్ పార్టీ లేని మూడో ఫ్రంట్ దేశంలో రావాల్సిన అవసరం ఉందని ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో ఎన్సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇప్పటికే వివిధ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మూడో ఫ్రంట్ అవసరం ఉందని సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా అన్నారని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పడుతుందని, ఆ ఫ్రంట్ కు పవార్ నేతృత్వం వహిస్తారని ఎన్సీపీ వర్గాలు చెపు తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడుతున్న శరద్ పవార్… మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ లతో కూడా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. కేరళలో వామపక్ష కూటమిలో ఎన్సీపీ భాగస్వామిగా ఉంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో పవార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీఎస్పీ, సమాజ్ వాది పార్టీలతో కూడా సాన్నిహిత్యం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos