ముంబై: మహా ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి సగం రోజులు పంచుకోవాలన్న శివసేన డిమాండ్లో న్యాయం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ శని వారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘శివసేన డిమాండ్ కొత్తదేమీ కాదు. 1990లో కూడా ఈ ఫార్ములాను అనుసరించిన కారణంగా వారీ డిమాండ్ చేస్తున్నారని శివ సేన డిమాండును గట్టిగా సమర్థించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా , శివసేన కలిసి పోటీ చేసినపుడు భాజపా 105, శివసేన 56 స్థానాల్లో గెలిచాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి సిద్ధమైంది. ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు కూడా ఇవ్వాలని శివ సేన డిమాండ్ చేస్తుండడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది.