ఆంధ్రప్రదేశ్ శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా గెలిస్తే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ గెలిచినట్లేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా నూజివీడులో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. వైకాపాను గెలిపిస్తే మనల్ని ద్రోహులని తిట్టిన తెరాసను గెలిపించినట్లేనని అన్నారు. వరంగల్‌లో జగన్‌ను తెరాస విద్యార్థి విభాగం కార్యకర్తలు రాళ్లతో కొట్టి తరిమారని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరుషం లేదా, మనం తెలంగాణ నేతలకు బానిసలమా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా అయిదేళ్లూ ఏమీ చేయని జగన్ ముఖ్యమంత్రి అయితే ఏం చేయగలరని నిలదీశారు.