
విశాఖ పట్టణం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక విధానసభ అభ్యర్థిగా గురువారం విశాఖ నగర పాలక సంస్థ ఐదో జోన్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామ పత్రాలు సమర్పించారు. భీమవరంలో శుక్రవారం నామ పత్రాల్ని దాఖలు చేయనున్నారు. ఆయన అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దాగారు. గాజువాక, భీముని పట్నం, దక్షిణ విశాఖ నియోజకవర్గాల్లో మూడు ఎన్నికల ప్రచార సభల్లో కూడా గురువారం ప్రసంగించనున్నారు.