
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విధానసభ స్థానాల నుంచి పోటీ చేయనున్నారని మంగళవారం పార్టీ అధికారికంగా ప్రకటించింది. అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం నియోజక వర్గాల్లో విజయావకాశాల్ని పరిశీలించిన తర్వాత ఈ స్థానాలకుపోటీ చేయాలని తీర్మానించారు. భీమవరం పవన్ కళ్యాణ్ సొంత జిల్లాతో పాటు సామాజిక వర్గం పరంగా కూడా కలిసొచ్చే అంశం.