ఆయన పోస్టును అర్థం చేసుకున్నా

ఆయన పోస్టును అర్థం చేసుకున్నా

అమరావతి:ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కొన్ని రోజులుగా జరుగుతున్న ఎక్స్ వేదికగా జరుగుతున్న వార్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రకాశ్‌రాజ్ తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరికి ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. నటుడిగా ఆయనను ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. ఆయనతో కలిసి పనిచయడం తనకెంతో ఇష్టమన్నారు. తిరుమల లడ్డూ వివాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో దోషులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే తాను పోస్టు పెట్టానని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ పోస్టును తానేమీ తప్పుగా అర్థం చేసుకోలేదని, కాకపోతే ‘ఢిల్లీలో మీ స్నేహితులు’ అంటూ ఆయన అలా కామెంట్ చేయకుండా ఉండాల్సిందని అన్నారు. ఆయన ఉద్దేశం తనకు అర్థమైందని పవన్ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos