
అమరావతి: వచ్చే ఎన్నికల్లో రెండు విధానసభ నియోజక వర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం ట్వీట్ చేశారు. పోటీ చేయనున్న నియోజక వర్గాల పేర్లను తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు.. విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో స్థానంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల్లో పవన్ తన సోదరుడు చిరంజీవి బాటను అనుసరిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. తిరుపతిలో మాత్రమే గెలిచారు.