అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నందున బుధవారం ఇక్కడ జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడింది. క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లే అంశంపై పవన్ రేపు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పవన్కు వైరల్ జ్వరం రావడంతో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలో మరో తేదీ వెల్లడిస్తామని జనసేన నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.