అమరావతి : శాసన సభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేశ్ విశాఖ ఉత్తర నుంచి పోటీ చేయనున్నారు. ఇద్దరు ప్రముఖులు ఒకే జిల్లా నుంచి పోటీ చేస్తుండడంతో విశాఖకు ప్రాధాన్యం పెరిగింది. మరో వైపు పవన్ సోదరుడు నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నట్లు సమాచారం.