
కర్నూలు: సౌభాగ్య సీమ పథకం కింద కేసీ కెనాల్ ఆయకట్టులో ఏటా రెండేసి పంటలకు నీరందిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ యువకులు సొంతంగా పరిశ్రమలు ప్రారంభించు కునేందుకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. పదేళ్ల పాటు రాయలసీమను కరవు ప్రాంతంగా ప్రకటించి సహాయక చర్యల్ని చేపడతామని వివరించారు. రైతు రు ణాల్ని మాఫీ చేస్తామని, ప్రతి రైతుకూ రూ.ఐదు వేలు వంతున పింఛను వితరణ చేస్తామని, ఎకరాకు రూ.ఎనిమిది వేలు వంతున పెట్టుబడి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.