గుంటూరు : జనసేన అధికారంలోకి రాగానే మూడు లక్షల ఉద్యోగాల భర్తీ
ప్రక్రియను పూర్తి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సోమవారం
గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కొత్త రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి
తానేనని ప్రకటించుకున్నారు. గుంటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపిస్తానన్నారు.
గతంలో అతిసారంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్ పట్టించుకోలేదని
ఆరోపించారు. వైకాపా డొంక తిరుగుడు రాజకీయాలకు పాల్పడుతోందని, అది తనకు తెలియదని అన్నారు.
ఇక్కడ భాజపాను తిడతారని, ఢిల్లీకి వెళ్లి వారి కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు.
ముస్లింల ఓట్లను కోరుకునే వైకాపా, వారికి పదవులు మాత్రం ఇవ్వదని విమర్శించారు.