న్యూ ఢిల్లీ : ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజ్ ఘాట్లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మౌన దీక్ష ఆరంభించారు. 3 గంటల పాటు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్తోనే దీక్షను చేపట్టినట్లు వివరించారు. గడచిన 8 ఏళ్లుగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్రం, ప్రధాని మోదీ తొక్కిపెట్టారని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టం హామీల అమలు కోసం వచ్చే బుధ వారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నట్లు తెలిపారు. అప్పటికీ విభజన చట్టం హామీలు అమలు కాకుంటే ఆగస్టు 15 నుంచి తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.తెలుగు ప్రజల సత్తా చూపకపోతే విభజన చట్టం హామీలు అమలు కావని పేర్కొన్నారు.