సూపర్‌స్టార్
మహేశ్‌బాబు,బ్రిల్లియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో 2014లో విడుదలైన సైకలాజికల్
థ్రిల్లర్ 1 నేనొక్కడినే చిత్రం విమర్శకుల మెప్పు పొందిన ప్రేక్షకుల మెప్పు పొందలేక
భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది.ఆ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన థ్రిల్లర్ సినిమాల్లో
ఉత్తమ చిత్రాల జాబితాలో ముందువరుసలో స్థానం సంపాదించి ఐఎండీబీ రేటింగ్‌లో అగ్రస్థానంలో
నిలిచిన 1 నేనొక్కడినే సినిమా తెలుగు ప్రేక్షకులకు రుచించలేదు.ఈ చిత్రంపై ప్రముఖ రచయిత
పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు.పరుచూరి పలుకులు పేరుతో చిత్రాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న
గోపాలకృష్ణ తాజాగా 1 నేనొక్కడినే చిత్రంపై స్పందించారు.మొత్తం 2 గంటల 56 నిమిషాల నిడివి
ఉన్న చిత్రంలో దర్శకుడు చివరి రెండు నిమిషాల్లో మాత్రమే కథను వివరించడాని తెలిపారు.ఎలాంటి
పరిస్థితుల్లోనైనా పెరిగే గోల్డెన్ రైస్‌ను ప్రపంచానికి అందించాలనే తండ్రి ఆశయాన్ని
కొడుకు ఎలా నెరవేర్చాడన్నదే 1 నేనొక్కడినే చిత్ర కథ.ఈ కథను చిత్రం ముగింపులో చెప్పడంతో
అప్పటికే నిడివి ఎక్కువై మూడ్ నుంచి బయటకు వచ్చేసిన ప్రేక్షకులకు కథ అంతగా రుచించలేదని
తెలిపారు.ఇక చిత్రంలో మహేశ్‌బాబు నిజానికి,భ్రమకు తేడా తెలియక సతమతమవుతూ ఉంటాడు. అందుకు
హీరోయిన్ సన్నివేశాలు కూడా అలాగే ఉండడంతో మహేశ్‌బాబుతో పాటు ప్రేక్షకులు కూడా అయోమయానికి
గురయ్యారన్నారు.ఈ సన్నివేశాలు తగ్గించి హీరోయిన్‌తో లవ్ సీన్స్ పెట్టి ఉంటే పరిస్థితి
కొంచెం బాగుండేదన్నారు. చివరలో తన అమ్మనాన్నల గురించి తెలుసుకునే క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు
కూడా ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారన్నారు.ముఖ్య ప్రతినాయకుడు
చనిపోయాక కూడా కథను ఎక్కువసేపు నడిపించడం కూడా చిత్రానికి మైనస్‌గా నిలిచిందన్నారు.ఆకలిచావులను
అధిగమించడానికి గోల్డెన్‌రైస్ వంటి పంటలు అవసరమనే అద్భుతమైన కాన్సెప్ట్‌ను దర్శకుడు
సుకుమార్ ఎంచుకున్నా కథను చెప్పే విధానంలో లోపాల వల్ల 1 నేనొక్కడినే వంటి అద్భుత చిత్రం
ప్రేక్షకులకు చేరువ కాలేకపోయిందన్నారు..