పార్లమెంట్​లో ఈ అతి సాధారణ పదాలూ నిషిద్ధం

న్యూ ఢిల్లీ: పార్లమెంట్లో జుమ్లాజీవి, కొవిడ్ స్ప్రెడర్, స్నూప్ గేట్మరి కొన్ని పదాల ప్రయోగాన్ని నిషేధించినట్లు పార్లమెంట్ సచివాలయ గురువారం ప్రకటించింది. దీంతో పాటు అతి సాధారణంగా ఉపయోగించే సిగ్గు చేటు, వేధించడం, మోసగించడం, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత, శకుని, తానాషా, వినాశ పురుష్, ఖలిస్థానీ, ద్రోహ చరిత్ర, చంచా, చంచాగిరి, పిరికివాడు, క్రిమినల్, మొసలి కన్నీళ్లు, గాడిద, అసమర్థుడు, గూండాలు, అహంకారి, చీకటి రోజులు, దాదాగిరి, లైంగిక వేధింపులు, విశ్వాస ఘాతకుడు వంటి పదాలూ ఈ జాబితాలో ఉన్నాయి. దీని పై విమర్శలు వ్యక్తమయ్యాయయి. అత్యంత సాధారణంగా ఉపయోగించే పదాలను కూడా మాట్లాడొద్దని చెప్పడం సరికాదంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మండి పడ్డారు. తాను వాటిని ఉపయోగిస్తానని, అవసరమైతే సస్పెండ్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. ”మరికొద్ది రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎంపీలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి మేం ప్రసంగించేటప్పుడు సిగ్గుచేటు, వేధింపులు, మోసం, అవినీతి, అసమర్థుడనే సాధారణ పదాలను కూడా వాడకూడదంట. నేను ఆ పదాలను ఉపయోగిస్తాను. కావాలంటే సస్పెండ్ చేయండి. ప్రజాస్వామ్యం కోసం పోరాడతా” అని ఓబ్రెయిన్ ట్విటర్లో రాసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos