పార్లేలో పది వేల మందికి ఉద్వాసన

  • In Money
  • August 21, 2019
  • 174 Views
పార్లేలో పది వేల మందికి ఉద్వాసన

ఢిల్లీ : ఆర్థిక మందగమనం సామాన్యుల పొట్ట కొడుతోంది. ఒక్కో రంగంలోనే వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పటికే వేల మంది రోడ్డున పడగా, దేశంలోనే అతి పెద్ద బిస్కెట్ల తయారీ సంస్థ పార్లేలో పది వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బిస్కెట్ల అమ్మకాలు పడిపోయినందున, ఉత్పత్తిని కూడా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఎనిమిది వేల నుంచి పది వేల మంది దాకా ఉద్యోగాలు కోల్పోతారని కంపెనీ కేటగిరీ హెడ్‌ మయాంక్‌ షాను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం రాసింది. 1929లో ప్రారంభమై పార్లే కంపెనీలో లక్ష మంది దాకా పని చేస్తున్నారు. మరో వైపు పార్లే ప్రధాన పోటీదారు బ్రిటానియా ఇండస్ట్రీ సైతం పెను సమస్యలు ఎదుర్కొంటోందని తెలుస్తోంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos