పాలకొల్లు : ఇక్కడి క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో చదరపు గజం భూమి ధర రూ.2.50 లక్షలు పలికటం చర్చనీ యాంశమైంది. పట్టణంలో చదరపు గజం భూమి ధర రూ.32-40 వేలు.ఆలయానికి సమీపంలోని వ్యక్తి ఒకరు చదరపు గజం భూమిని ఏకంగా రూ.2.50 లక్షలకు కొని ఆశ్చర్యపరచారు. రెండు దశల్లో 200 చదరపు గజాల భూమిని కొన్నారు. ఒక దశలో చదరపు గజానికి రూ.1.75 లక్షలు చెల్లించారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు ఇక్కడి భూమి ధర చదరపు గజానికి రూ.1.25 లక్షల వంతున పలికింది.