పుల్వామా ఉగ్రదాడి
అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య అన్ని సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.పాకిస్థాన్
దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 200శాతం సుంకం పెంచిన భారతప్రభుత్వం పాకిస్థాన్‌కు
భారతదేశం నుంచి ఎగుమతులు కూడా నిలిపివేసింది.భారత ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయానికి
మద్దతుగా దేశ టమోట రైతులు కూడా ఎగుమతులు నిలిపివేసారు.ఈ పరిణామాలతో పాకిస్థాన్ దేశంలో
టమోటలకు తీవ్ర సంక్షోభం ఏర్పడింది.టమోట దిగుమతి నిలిచిపోవడంతో కిలో టమోట రూ.300కు చేరుకోవడంతో
ప్రజలు విలవిల్లాడుతున్నారు.టమోటల ఎగుమతులు నిలిపివేయడంపై పాకిస్థాన్ దేశ ప్రజలు,ప్రజాప్రతినిధులు
చివరకు జర్నలిస్టులు కూడా మండిపడుతున్నారు.ఈ క్రమంలో లాహొర్ నగరంలోని సిటి42 టీవీ
మీడియా సంస్థకు చెందిన ఓ జర్నలిస్ట్ భారత్ నుంచి వచ్చే టమోటాలను దేశ ప్రధాని నరేంద్రమోదీపై,ఏఐసీసీ
అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముఖాలపై విసిరికొట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు.అంతటితో ఆగకుండా
ఒక అడుగు ముందుకేసి టమోట ఎగుమతులు నిలిపివేసిందుకు భారత్‌పై అణుబాంబులు వేయాలంటూ డిమాండ్
చేసాడు.తప్పయిందని మరోసారి పునరావృతం కానివ్వమంటూ భారత్ పాకిస్థాన్‌కు వెయ్యిసార్లు
క్షమాపణలు చెప్పించేలా చేస్తామంటూ హెచ్చరించాడు.పాక్ జర్నలిస్టు వ్యాఖ్యలపై భారత నెటిజన్లు నవ్వుపుట్టించే కామెంట్లు చేస్తున్నారు. ‘భలే జోక్’ అని కొందరు అంటుండగా, ఒక్క టమాటాలు ఆపేస్తేనే పాక్ విలవిల్లాడిపోతోందని మరికొందరు ఎద్దేవా చేశారు.దేశమే ఉగ్రవాదులకు
అడ్డాగా,దేశ ప్రధాని ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు కాకుండా
నీతిసూత్రాలు ఊహించగలమా?