న్యూఢిల్లీ: అరేబియా సముద్ర మార్గం గుండా పాక్ కమాండోలు భారత భూ భాగంలోకి చొరబడ వచ్చని నిఘా వర్గాల పసిగట్టటంతో గుజరాత్ నుంచి కేరళ వరకూ తీరం వెంబడి భద్రతను కట్టు దిట్టం చేశారు. కచ్ ఖాతం, సర్ క్రీక్ ప్రాంతం నుంచి పాక్ కమాండోలు, ఉగ్ర వాదులు చిన్న చిన్న పడవల ద్వారా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గమనించాయి. గుజరాత్తో బాటు ప్రముఖ నగరాల్లో ఉగ్ర వాదులు దాడులు జరిపి విధ్వంసాన్ని సృష్టించదలచారని మదింపు. నౌకలపై దాడుల్లో వీరికి శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.