ఢిల్లీ : కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ ఇంకా కారాలు మిరియాలు నూరుతూనే ఉంది. తాజాగా ఆ దేశ రైల్వే మంత్రి షేక్ రషీద్ ఒకడుగు ముందుకేసి, అక్టోబరు-నవంబరులో ఇండియా, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరగవచ్చని జోస్యం చెప్పారు. కశ్మీర్ గురించే పోరాడే సమయం ఆసన్నమైందంటూ, ఇరు దేశాల మధ్య ఇదే ఆఖరి యుద్ధమని వెల్లడించారు. కశ్మీర్ విషయంలో భద్రతా మండలి ముందుకు రావడం లేదని విమర్శించారు. మండలి కనుక ఇదివరకే చొరవ చూపి ఉంటే కశ్మీర్లో ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఉండేదని ఆయన పేర్కొన్నారు.