పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఉండదు…

  • In Sports
  • February 18, 2019
  • 225 Views
పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఉండదు…

న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమ్మతించే
దాకా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌ జరిగే అవకాశం లేదని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా తెలిపారు. అయితే  ప్రపంచ కప్‌లో భారత్‌-పాక్‌ మధ్య జరగాల్సిన మ్యాచుల గురించి తాను ఏ విషయమూ చెప్పలేనని వ్యాఖ్యానించారు. జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఒకరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే ఆ ప్రభావం క్రీడలపైన కూడా పడుతుందని
అన్నారు. ఉగ్ర దాడిపై భారత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి. వారు ఉగ్రవాదానికి మద్దతు తెలపొద్దు. మొదటి నుంచి మనం ఇదే విషయాన్ని చెబుతున్నాము…అని తెలిపారు. పుల్వామా ఉగ్ర దాడి  నేపథ్యంలో
రెండు పాయింట్లు కోల్పోయినా ఫర్వాలేదు, ప్రపంచ కప్‌లోనూ పాక్‌తో భారత్ ఆడొద్దు…అనే డిమాండ్లు
అధికమయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos