ఇస్లామాబాద్ : విన్నారా ఈ వింత కోరిక. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు గెలవాలని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ ఘన విజయం సాధించాలి. ఇంగ్లండ్ దారుణంగా ఓడిపోవాలి…ఇదీ వారి ఆకాంక్ష. దీని వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే, పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలవాలని మీరు కోరుకుంటున్నారు..అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ ట్విటర్ ద్వారా ప్రశ్నించాడు. దీనికి పాక్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఒక అభిమాని జైహింద్ అంటే..మరో అభిమాని వందేమాతరం అంటూ సమాధానాలిచ్చారు. మేం మా పొరుగు వారిని చాలా ప్రేమిస్తాం, మేం కచ్చితంగా భారత్‌కే మద్దతునిస్తాం అని ఇంకొకరు రాశారు. భారత్, పాక్‌లు ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా ఒక్కటవుతాయి అని మరొకరు ట్వీట్ చేశారు. నేను పాకిస్తానీనే, కానీ భారత్‌కు మద్దతునిస్తాను. ఎందుకంటే ఎవరెన్ని చేసినా పాకిస్తాన్ టీమ్ గెలవదని నాకు తెలుసు. భారత్ జట్టు మాకంటే చాలా ముందుంది…అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. విరాట్, 18 అని రాసి ఉన్న జెర్సీని ధరించి బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు.