ఇస్లామాబాద్: ‘కశ్మీర్పై సంయమనం పాటిస్తున్నాం. మేము మెదలకుండా ఉన్నామని లబ్ధ పొందేందుకు ఇండియా ప్రయ త్నిస్తే ప్రమాదకరమ’ ని ఐక్యరాజ్య సమితికి బుధవారం పాక్ రాసిన లేఖలో హెచ్చరించింది. కశ్మీర్ వ్యవహారంపై భద్రతామండలి అత్యవసర భేటీ నిర్వహించి చర్చించాలనీ అందులో కోరింది. ఇంతకు ముందూ పాక్ ఐరాసకు రాసిన లేఖలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని భారత్ ఉల్లంఘించిందని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించేందుకు ఆ సంస్థ అధినేత జోవన్నా వ్రోనెక్కాను న్యూయార్క్లో జరిగిన విలేఖరుల సమావేశంలో తిరస్కరించారు. విలేకరి ప్రశ్నించగానే ‘నో కామెంట్స్’ అని వెళ్లిపోయారు. జమ్మూ-కశ్మీర్కు ఆర్టికల్ 370 కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దు చేయడం ఐక్య రాజ్య సమి తి భద్రతా మండలి తీర్మానాన్ని ఉల్లంఘించడమేనని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్కు లేఖ రాశారు