మన గడ్డ పై పాక్‌ డ్రోన్ సంచారం

మన గడ్డ పై పాక్‌ డ్రోన్ సంచారం

ఫిరోజ్పూర్: ఇక్కడకు సమీపంలోని హుస్సేనివాలా సరిహద్దులో మంగళవారం పాక్ డ్రోన్ సంచారాన్ని సరిహద్దు భద్రతా దళాలు గుర్తించాయి. సోమ వారం రాత్రి 10- 10.40 గంటలమధ్య ఐదు సార్లు కొట్టింది. అర్ధరాత్రి 12:25 గంటల సమయంలో భారత సరిహద్దులోకి ప్రవేశించింది.దీన్ని గమ నించిన భారత జవాన్లు వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. సరిహద్దు రక్షక దళాలు, పంజాబ్ పోలీసులు, ఇతర నిఘా వర్గాలు మంగళవారం ఉదయం నుంచి గాలింపులు చేపట్టాయి. డ్రోన్స్ ద్వారా పాకిస్థానీ ఉగ్ర మూకలు డ్రగ్స్, మందు గుండు సామగ్రి సరఫరా చేస్తున్నాయే మో  ననే సందేహిస్తున్నారు. రెండు వారాల కిందట ఇలాగే అనుమానాస్పదంగా తిరుగుతున్న రెండు డ్రోన్లను పంజాబ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos