చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయనేమన్నారంటే…గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా రాజ్యం నడుస్తుంది. రేషన్‌కార్డు, ఇల్లు సహా.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్‌కోసం వృద్ధులు కోర్టుకు వెళ్లే దారుణమైన పరిస్థితి నెలకొంది. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు. జయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే.. టైర్ పంక్చర్ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్ లేకపోవడంతో ఆ గర్భిణీ బస్సులోనే ప్రసవించారు.
రాష్ట్రంలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఉద్దానంలో 4వేల మంది కిడ్నీ బాధితులుంటే.. ప్రభుత్వం 1400 మందికి మాత్రమే సాయం చేస్తుంది. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్ పేషెంట్‌లకు ముష్టి వేసినట్లు 2500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. విటి మండలంలో అమ్మాయిలు చదివే జూనియర్ కాలేజీల్లో బాత్‌రూమ్‌లు లేకపోవడం దారుణం. చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు ముక్యమంత్రి అయ్యాక ఆరువేల ప్రభుత్వ పాఠశాలలు మూయించివేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల హాస్టళ్లను మూసివేయించారు. మధ్యాహ్న భోజన పథకానికి ఆరు నెలలుగా బిల్లులు చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలానికి చెందిన గోపాలన్న నన్ను కలిశారు. అక్కడ ఫ్లెక్సీలో ఉన్న వ్యక్తి తన కొడుకు అని, తాను ఫీజులు కట్టలేకపోవడంతో ఇంజినీరింగ్ చదువుతున్న తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.