కేరళ మృతులు ఇద్దరే

తిరువనంత పురం: చైనా, వుహాన్లో మహమ్మారి కరోనా వైరస్ పుట్టి నేటికి సరిగ్గా 100 రోజులైంది. కరోనా జాడలు మన దేశంలో తొలిసారి కేరళలో కనిపించాయి. శుక్రవారం కొత్తగా మరో 12 కేసులు దాఖలయ్యాయి. ఏప్రిల్ 10 ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 357 కు చేరాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్విటర్ లో తెలిపారు. వారిలో 97 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పీడితుల సంఖ్య 258. రాష్ట్రంలో కేవలం ఇద్దరే మరణించారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,710 నమూనాలు పరీక్షించారు. బాధితుల చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రుల్ని ఏర్పాటు చేసాం. లాక్డౌన్ వల్ల తిండిలేక ఇబ్బందులు పడుతున్న 28 లక్షల మందికి 1251 సామూహిక భోజన కేంద్రాల్లో ఆహారం అందిస్తున్నాం. 3676 నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించా మన్నారు. 357 కేసులున్న కేరళ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కేసులతో పోల్చుకుంటే ఏడో స్థానంలో ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1364 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. జనవరి 30 న కేరళలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos