మత్తు వదిలించేందుకు ఎంపీ భరోసా

మత్తు వదిలించేందుకు ఎంపీ భరోసా

అమృత్ సర్: మాదక ద్రవ్యాలకు బానిసైన యువతికి సొంత ఖర్చులతో చికిత్సచేయించేందకు స్థానిక లోక్సభ సభ్యుడు గుర్జీత్ సింగ్ ఔజ్లా ముందుకు వచ్చారు. తన కూతురిని మాదక ద్రవ్యాల బారి రక్షించేందుకు ప్రభుత్వం డీ అడిక్షన్ కేంద్రంలో చేర్పించినా ఫలితం లేకపోవడంతో తల్లి కూతురుని సంకె ళ్లతో ఇంట్లోనే బంధించింది. దీన్ని తెలుసుకున్న గుర్జీత్ సింగ్ ఔజ్లా ఆ యువతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. యువతికిఇంటి వద్దే  చికిత్స చేయాలని సంబంధిత వైద్యులను ఆదేశించారు. ‘నా కుమార్తెను పలు మార్లు డీ అడిక్షన్ సెంటర్కు తీసుకెళ్లా. నాలుగైదు రోజులు ఉంచు కుని ఇంటికి పంపారు. మాదక ద్రవ్యాల వ్యసనపరులు నాలుగైదు రోజుల్లో ఎలా కోలుకుంటారు? నా బిడ్డ పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందించాలని వేడుకున్నా ఫలితం లేక పోయింద’ని యువతి తల్లి వాపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos