నమ్మకమైన ప్రధాని కావాలి..కాపలాదారు కాదు

హైదరాబాద్: దేశం నమ్మకస్తుడైన ప్రధానిని తప్పా చౌకీదార్ని (కాపలాదారుడు) కోరుకోవటం లేదని హైదరాబాద్ లోక్సభ సభ్యుడు మజ్లీస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురువారం ఇక్కడ వ్యాఖ్యానించారు ‘మీ (నరేంద్రమోదీ) హయాంలోనే ఉగ్ర వాదుల దాడులు పెరిగాయి. పఠాన్కోట్, ఉరి, పుల్వామా లాంటి దుర్ఘటనలు మీరు ప్రధానిగా ఉండగానే జరిగాయి. మీరేం చేస్తున్నారు? మీరే రకమైన చౌకీదార్ (కాపలాదారుడు)? ఈ దేశం నమ్మకమైన ప్రధానమంత్రిని కోరుకుంటోంది. మీలాంటి చౌకీదార్ని కాదు’’ అని ఓవైసీ అన్నారు. ‘మీరు నిజంగానే ఈ దేశానికి చౌకీదార్ అయితే, సంజౌతా ఎక్స్ప్రెస్ బాంబు పేలుడు నిందితుడు అసీమానంద్కు వ్యతిరేకంగా కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేయండి. అసీమానంద్ను చూసి ఎందుకు భయపడుతున్నారు?’ అని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos