హైదరాబాద్ : ఉస్మానియా విశ్వ విద్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు అనుమతించరాని విశ్వ విద్యాలయం కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ‘ రాహుల్ గాంధీ సభకే కాదు, అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. కెమెరాలను నిషేధించి శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది. కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6వ తేదీన వరంగల్ వేదికగా ‘రైతు సంఘర్షణ సభ’ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఆ మరుసటి రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద రాహుల్గాంధీ.. విద్యార్థులతో మమేకం అవుతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదివరకే తెలిపారు. అయితే ఇప్పుడు సభకు అనుమతి నిరాకరిస్తూ ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.